మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నా… ఇప్పటికీ చాలా మందిలో వ్యాక్సిన్ భయం లేకపోలేదు. దీనికి ప్రధాన కారణం.. వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.. మళ్లీ కోవిడ్ బారిన పడుతున్నారు.. వ్యాక్సినేషన్ తర్వాత కొందరు ప్రాణాలే కోల్పోయారు.. ఇలా అనేక వార్తలు హల్ చల్ చేశాయి.. అయితే, భారత్‌లో వ్యాక్సిన్లతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగానే ఉన్నాయని స్పష్టం చేసింది అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ నివేదిక.. వ్యాక్సినేషన్.. దానివల్ల కలుగుతోన్న దుష్పరిణామాలపై నివేదికను ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది ఏఈఎఫ్ఐ. ఆ నివేదికలో వ్యాక్సినేషన్‌తో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్‌ను వివరంగా పేర్కొంది అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్… భారత్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కేవలం 26 మందిలో మాత్రమే రక్త స్రావం, రక్తం గడ్డకట్టడం వంటి పరిణామాలు జరిగాయని తెలిపింది.. ఇక, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో అలాంటి కేసులేవీ గుర్తించలేదని స్పష్టం చేసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టినట్టు కొన్ని వార్తలు రాగా.. అయితే అలాంటి కేసులు భారత్‌లో అతి స్వల్పమని పేర్కొంది ఏఈఎఫ్ఐ.
previous post
ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టించింది: కన్నా