telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

యాదాద్రి ఇంకా ఆలస్యం.. నిధుల కొరతే కారణమా..!

more delay in yadadri lack of funds

తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణకి ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిప్రాయాన్ని నిజం చేస్తూ 2014లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ దీటైన ప్రభుత్వ పథకాలను తీసుకొని వచ్చారు. అలాగే ఉద్యోగులకి 42 శాతం ఐఆర్ ఇచ్చారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలోని తిరుపతిని తలపించేలా యాదాద్రి నరసింహస్వామి గుడిని తయారు చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ ఆలయ నిర్మాణం పనులను తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు ఈ యాదాద్రి ఆలయం పునరుద్ధరణ పనులు జరుగుతున్న వేళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో ఆధ్యాత్మిక శోభతో వెలుగుతున్న యాదాద్రి ఆత్రుతతో కట్టే విషయం కాదు. ఎన్నో ఆలోచనలు చేసి మన సంస్కృతి ఉట్టిపడేలా తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఆలయ నిర్మాణంలో ఎటువంటి తొందరపాటు అవసరం లేదని అన్నీ కూడా శాస్త్ర నియమాలు ప్రకారం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు అని తెలుస్తుంది.అన్ని పనులు పూర్తికావడానికి రెండు నెలల సమయం పడుతుందని అధికారులు సీఎంకు నివేదించారు. భక్తులకు దర్శనం కలిగించడం ఎంత ముఖ్యమైన విషయమో. వారికి వసతులు కల్పించడం కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు. అసలు విషయం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం నిధుల కొరతతో తీవ్రమైన ఒత్తిడి మధ్యలో ఉందని తెలుస్తుంది. దీనితో అలా మేము ఇప్పుడే అభివృద్ధి చెయ్యమని చెప్పకుండా ఇలా కవర్ చేస్తున్నారని కొందరి వాదన. నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఫిబ్రవరిలో సుదర్శన నారసింహ యాగం నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఫిబ్రవరి నాటికి ఈ వసతులు అన్ని పూర్తవుతాయా అని ప్రశ్న ఇప్పుడు వస్తుంది. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు విడుదల జాప్యం వల్ల ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. తన ప్రతిష్టాత్మక కార్యక్రమానికే కేసీఆర్ నిధులు విడుదల చేయలేని పరిస్థితిలో తెలంగాణ ఖజానా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts