వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ సామాన్యులు కూడా కొనుగోలు చేయగలిగే బడ్జెట్ రేంజ్‌లో ఎస్ 1 ప్రొ భారతదేశంలో లాంచ్ చేసింది. ఎస్ సిరీస్‌లో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 19,990 ధర వద్ద వివో షోరూం లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వివో ఇండియా తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం వైట్, బ్లూ, బ్లాక్ మూడు కలర్ వేరియంట్లలో వచ్చింది.
వివో ఎస్ 1 ప్రొ ఫీచర్లు:
- 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
- 340 X 1080 పిక్సెల్స్ రిజల్యూషన్
- క్వాల్కం స్నాప్ డ్రాగన్ 665 సాక్
- 48+8+2+2 ఎంపీ రియర్ కెమెరా
- 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 8 జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్
- 4500 ఎంఏహచ్ బ్యాటరీ
- జనవరి 31 వరకు వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్
- ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డు కొనుగోలుపై 10శాతం క్యాష్‌బ్యాక్
- జనవరి 31 వరకు 12వేల రూపాయల విలువ చేసే జియో ఆఫర్
అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి: కన్నా