telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అకీరా ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

adavi sesh with pavan son akira viral

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ వెండితెర అరంగ్రేటం అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అకిరా ఫేవరెట్ హీరో ఎవరని ప్రశ్నకు బదులుగా.. ‘ఎవరు’ సినిమా చూసిన తరువాత నుంచి అకిరా.. అడివి శేష్‌ని అమితంగా ఇష్టపడటం మొదలు పెట్టాడు. వారిద్దరూ ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడా చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్‌ని అకిరా.. అన్న అని పిస్తాడని చెప్పుకొచ్చారు. అలాగే వీరు అప్పుడప్పుడూ కలుస్తూ చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారని రేణు దేశాయ్ తెలిపారు. ఇదివరకే రేణు దేశాయ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. అకిరా ప్రస్తుతం తన స్టడీస్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. అకిరాకు ఇప్పుడైతే హీరో అవ్వాలనే కోరిక లేదని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు రేణు దేశాయ్. ఇక తన హైట్‌తో.. తనకి తెలియకుండానే స్పెషల్ బజ్ క్రియేట్ చేసుకున్నాడు అకిరా. ఇక వీలైనంత త్వరగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలని పవన్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

Related posts