telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మరో రికార్డు సాధించిన కాళేశ్వరం ఎత్తిపోతలు…

ముఖ్యమంత్రి ఎంతో పట్టుబట్టి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించిన విషయం తెలిసిందే. అందువల్ల తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగం జరుగుతుంది. అయితే మణిహారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయింది. మేఘా భూగర్భ ఇంజనీరింగ్‌ అద్భుతంతో గాయత్రి పంపింగ్ కేంద్రంలో మరో రికార్డ్ నమోదయింది. అనతికాలంలోనే భూగర్భ అద్భుతం గాయత్రి పంప్ హైస్ నుండి 100 టిఎంసీల ఎత్తిపోత ప్రారంభం అయింది. గాయత్రి పంప్ హౌస్ నుండి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్‌ ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు తరలిస్తున్నారు. ఆగష్టు 8, 2019లో గాయత్రి పంప్ హౌస్ ను మేఘా ప్రారంభించింది. అత్యధికంగా 1703 గంటలు నీటిని పంపింగ్ చేసిన రెండవ మిషన్ గా ఇది రికార్డులకు ఎక్కింది. ఇక మొదటి మిషన్ నుండి 1367 గంటల పాటు నీటిని ఎత్తి పోసింది. ఒక్కొక్క పంప్ హౌస్ నుండి 3150 క్యుసెక్కుల నీటి విడుదల అవుతోంది. గాయ్రతి పంప్ హౌస్ 111.4 మీటర్ల ఎత్తుకు 100 టిఎంసీల నీటిని పంప్ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో లింక్‌-2 లో భాగంగా గాయత్రి పంప్‌హౌస్‌ నిర్మాణం జరిగింది. ఒక్కొక్కటి 139 మెగావాట్లతో మొత్తం 7 మిషన్‌ల మేఘా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ పథకం ఇంకా ఏం ఏం సాధిస్తుంది అనేది.

Related posts