telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు

vvpatmachine 1

దేశవ్యాప్తంగా ఈవీఎంలు, వీవీప్యాట్ల పై ఎన్నికల సంఘానికి విపక్షాలు ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23 న ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో  ప్రకాశం జిల్లాలోని జూనియర్ కాలేజీ చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు కనిపించడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు దర్శనమివ్వడంతో స్థానికులు నివ్వెరపోయారు.

ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు ప్రత్యక్షమైన తీరుపై స్థానికులుఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇది పట్టించుకునే అంశమే కాదని, మాక్ పోలింగ్ సమయంలోనివని తేలిగ్గా కొట్టిపారేశారు. సరిగ్గా కౌంటింగ్‌కు నాలుగు రోజుల ముందు బయటపడటంతో అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఎన్నికల సిబ్బంది వ్యవహార శైలిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Related posts