శుక్రవారం రోజు “ఫలక్‌నుమాదాస్” చిత్రంతో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాగోలేదంటూ సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌పై విశ్వక్‌సేన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల విశ్వక్ సేన్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో బూతులు మాట్లాడుతూ విజయ్ దేవరకొండ హైదరాబాద్‌లో మీడియా ముందుకు వచ్చి, పిల్లలకు అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని అన్నాడు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నెగటివ్ పబ్లిసిటీ వల్లే కలెక్షన్స్ తగ్గుతున్నాయని విశ్వక్‌సేన్ భావిస్తున్నాడు. అయితే విశ్వక్ సేన్ పబ్లిక్ ఫ్లాట్ ఫామ్‌లో అభ్యంతరకరమైన భాషలో మాట్లాడటాన్ని విజయ్ దేవరకొండ ఫ్యాన్సే కాదు… నెటిజన్లు కూడా తప్పు పడుతున్నారు. విశ్వక్ పబ్లిసిటీ కోసం దిగుజారుడు మాటలు మాట్లాడుతున్నాడని అంటున్నారు.
మరో వైపు ఇద్దరి యువ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు మొదలయ్యాయంటూ ఛానెల్స్‌లో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందించలేదు. సోమవారం విశ్వక్‌సేన్ హైదరాబాద్‌లో మీడియా ముందుకు రాబోతున్నాడు. మరి మీడియాలో విశ్వక్ ఎలాంటి విమర్శలు చేస్తాడో చూడాలి. ఈ ప్రెస్ మీట్ తర్వాత విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి.
“సైరా” చేయలేకపోయినందుకు బాధపడ్డా… : పృథ్వీరాజ్