telugu navyamedia
సినిమా వార్తలు

టిక్కెట్ రేట్లపై ప్రభుత్వానికి చెప్పాల్సింది చెప్పా..ఇక‌పై

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా రెండున్న‌ర‌గంట‌పాటు జ‌రిగిన స‌మావేశం అనంత‌రం అమరావతిలో మీడియాతో మాట్లాడారు..థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చా జరగలేదని స్పష్టం చేశారు.

మంత్రి పేర్ని నానితో చర్చలు సంతృప్తికరంగా జ‌రిగాయ‌ని, సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో సినిమా క్వాలిటీ దెబ్బతింటుందని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. ఐదు ముఖ్యమైన అంశాలపై చర్చించామని, ప్రధానంగా టికెట్ల రేట్ల తగ్గింపును ముందుగా ప్రస్తావించానని చెప్పుకొచ్చారు.

RGV: I just came to hear my argument .. I have to say .. Verma after meeting  me .. | RGV interesting comments after meeting AP Cinematography Minister  perni Nani - filmyzoo - Hindisip

సినిమా టిక్కెట్ రేట్లపై తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పానని… సినీ రంగంతో నాకున్న 30ఏళ్ల అనుభవంతో ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చా. ఆయన కూడా కొన్ని విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని మా సినీరంగానికి చెందిన వారిని కలిసి చర్చిస్తాను. ఇదొక పద్ధతి ప్రకారం చేస్తాం. అందరికీ ఒక పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు.

ప్రభుత్వం చెప్తున్నదానికి మేం మాట్లాడేదానికి చిన్న చిన్న మిస్ అడర్ స్టాండింగ్స్ ఉన్నాయి..వాటిని కూర్చుని మాట్లాకోవడానికి మాత్రమే వచ్చాను తప్పితే అంతకు మంచి ఏమీ లేదు.

Ap Government TDP Cbn Bjp Chandrababu Ysrcp Raghurama Krishnamraju Cm Jagan Minister  Perni Nani Botcha Satyanarayana - Telugu-TeluguStop

నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం లేదు.. నేను చెప్పిన వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందా? అంటే నేనేం చెప్పలేను. ఫైనల్ డిసిషన్ గవర్నమెంట్‌దే. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్‌గా డైరెక్టర్‌గా నా వ్యూ పాయింట్ చెప్పడానికి మాత్రమే వచ్చాను.

బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ను టార్గెట్ చేసి ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్లు తగ్గించిందని తాను భావించడం లేదని తెలిపారు. థియేటర్ల మూసివేత అంశం తనకు సంబంధించిన విషయం కాదని ఆర్జీవీ స్పష్టం చేశారు.

సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే సినిమా క్వాలిటీ దెబ్బతింటుందని ఆర్జీవీ వెల్లడించారు. అందుకే సినిమా తీసిన నిర్మాత టిక్కెట్ ధరను నిర్ణయించుకునే అవకాశాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరానన్నారు.

ఒక నిర్మాతగానే తాను ఇక్కడికి వచ్చానని… తాను ఎగ్జిబిట్లర్లు, డిస్ట్రిబ్యూటర్ల తరఫున మంత్రి పేర్ని నానితో చర్చలకు రాలేదని ఆర్జీవీ వివరణ ఇచ్చారు. తాను ట్విట్టర్ లో పెట్టిన అన్ని ప్రశ్నలు మంత్రి పేర్ని నాని దగ్గర చెప్పానన్నారు.

సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశానికి సంబంధించి తాను ముగింపు ఇవ్వలేనని చెప్పారు. ఈ అంశానికి ముగింపు చెప్పాల్సింది ప్రభుత్వమేనని వర్మ తెలిపారు.

Related posts