telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆచార్య : చిరు షూటింగ్ కు హాజరయ్యేది అప్పుడేనా ?

Aacharya

కొరటాల శివ దర్శకత్వంలో ఈ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతుంది. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఆచార్య షూటింగ్ కూడా ప్రస్తుతానికి హోల్డ్‌లోనే ఉంది. ఏడు నెలలుగా కరోనా కారణంగా వాయిదా పడింది. నవంబర్ 9 నుంచి ఆచార్య మళ్లీ సెట్స్ పైకి వస్తున్నాడంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కూడా తమ అఫీషియల్ ట్విట్టర్ లోనే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసారు. ఆచార్య షూటింగ్ లో చిరంజీవి ఇప్పుడే పాల్గొనడం లేదని తెలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత మెగాస్టార్ జాయిన్ అవుతాడని ప్రచారం జరుగుతుంది. ఆ లోపు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. డిసెంబర్ చివర్లో చిరంజీవి ఆచార్య సెట్ లో అడుగు పెడతాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈయనకు జోడీగా రష్మిక మందన్న నటించబోతుంది. నవంబర్ 9 నుంచి ఆచార్య షూటింగ్ మొదలైనా.. చిరంజీవి లేని సీన్స్ మాత్రమే ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. చిరు వచ్చాక సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ.

Related posts