telugu navyamedia
సినిమా వార్తలు

గుత్తాజ్వాలాతో ఎఫైర్… క్లారిటీ ఇచ్చిన హీరో

Vishnu-Vishal-and-Gutta-Jwala

గత కొంతకాలంగా ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా, తమిళ హీరో విష్ణు మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు విన్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్త చర్చనీయాంశంగా మారింది. విష్ణు కొంతకాలం క్రితం తన భార్యతో విడిపోయిన విషయం తెలిసందే. విష్ణు ఇప్పుడు గుత్తాజ్వాలాని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు హీరో విష్ణు. తనకు జ్వాలా అంటే ఇష్టమని, ఆమెకి కూడా తానంటే ఇష్టమని చెప్పాడు. దాదాపు ఏడాదిన్నరగా ఒకరికి ఒకరు తెలుసని, కామన్ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తుంటామని చెప్పారు. ప్రస్తుతం తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని, ఈ స్నేహం తదుపరి దశకు వెళ్తుందా అనే ప్రశ్నకు తనవద్ద సమాధానం లేదని, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని చెప్పారు. ఇటీవలే “రాక్షసన్” చిత్రంతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ప్రస్తుతం “జగజ్జాల కిలాడి” అనే సినిమాలో నటిస్తున్నాడు.

Related posts