telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మార్చి 6న‌ ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ గా రానున్న ప్రభుదేవ

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ అప్పట్లో బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టరైజేషనే ఒక హైలైట్. అప్పటి వరకు డబ్బుల కోసం ఏమైనా చేసే పండు గాడి క్యారెక్టర్‌లో కనిపించిన మహేష్.. క్లైమాక్స్‌ల కృష్ణమనోహర్ ఐపీఎస్‌గా కనిపించి ప్రేక్షకుల్ని అలరించాడు. అప్పట్లో ఈ క్యారెక్టర్ ఎంత బాగా పేలిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ క్యారెక్టర్ పేరును ప్రభుదేవా తన సినిమాకు టైటిల్‌గా వాడుకున్నారు. ద‌ర్శకుడిగా కొరియోగ్రాఫర్‌గా అలానే హీరోగా కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎదిగారు ప్రభుదేవా. హిందీలో దర్శకుడిగా సినిమాలు చేస్తూనే తమిళంలో హీరోగా నటిస్తున్నారు. ఆయన తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా నటించిన తమిళ చిత్రం ‘పొన్ మానిక‌వ‌ల్’. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మార్చి 6న‌ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌ను పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్.సీతారామరాజు తెలుగు ప్రేక్షకుల‌కు అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభుదేవ‌కు జోడీగా నివేదా పేతురాజ్ న‌టించింది. ఇటీవ‌లే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘అల వైకుంఠ‌పుర‌ములో’ నివేదా న‌టించిన సంగ‌తి తెలిసిందే.

Related posts