telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాలుక చీరేస్తాం…బండి సంజయ్‌కి వార్నింగ్‌…

ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తొండి సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. నీది నోరా…? మోరా…? ఉద్యమ నేత కేసీఆర్ ను విమర్శించే అర్హత నీకు లేదని బండి సంజయ్‌పై ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలితే నాలుక చీరేస్తాం… బీజేపీ నేతలు ఖబడ్దార్ అని హెచ్చరించారు. పునర్విభజన చట్టంలో హామీలు ఏమయ్యాయని నిలదీశారు. బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేశారని… బిజెపి పార్టీ మతతత్వ పార్టీ అని పేర్కొన్నారు. బండి సంజయ్ ఎక్కడ ఎలాంటి అభివృద్ధి చేయరో చెప్పాలని… తెలంగాణ రాష్ట్ర పథకాలు, ప్రాజెక్టుకు కేంద్రం ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదని మండిపడ్డారు. వరంగల్ లో వరదలు వచ్చినప్పుడు వరద బాధితుల అన్ని రకాలుగా సహాయం చేశామని గుర్తు చేశారు. జయ శంకర్ బాటలో మేము అందరం పని చేస్తున్నామని.. కేంద్ర ప్రభుత్వము వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పార్టీ ఆఫీస్ కబ్జా చేసి కట్టారని వినయ్‌ భాస్కర్‌ ఆరోపించారు.

Related posts