telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈరోజు తెలంగాణ 10వ తరగతి ఫలితాలు…

తెలంగాణలో ఈరోజు 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను విడుదల చేయనున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫార్మటివ్ అస్సెస్మెంట్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది మార్కులు కేటాయించి గ్రేడ్లు ఖరారు చేయనున్నారు. అయితే ఈ పరీక్షల సమయంలో కరోనా సెకండ్ వేవ్ తెలంగాణలో కలకలం రేపింది. ఆ కారణంగా తెలంగాణ ప్రభత్వం టెన్త్ పరీక్షలు మొదట వాయిదా వేసిన ఆ తర్వాత రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి విద్యార్థికి పాస్ మార్కులు వేస్తామని… వారి ఎఫ్ఏ ఆధారంగా తుది మార్కులు ఇచ్చి గ్రేడింగ్స్ ప్రకటిస్తామని తెలిపింది. అయితే గత ఏడాది కూడా ఇలానే చేసినప్పుడు చాలా మందికి 10/10 వచ్చింది. మరి ఈసారి ఏం జరుగుతుంది… ఎంత మందికి 10/10 వస్తుంది అనేది చూడాలి మరి.

Related posts