telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వయసు ఎనిమిదేళ్లే… కానీ సంపాదన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే…!!!

Ryan

ఎనిమిదేళ్ల ర్యాన్ కాజీ అనే బుడతడు చదువుకునే వయస్సులో అత్యధిక పారితోషకం అందుకుంటున్న వ్యక్తిగా ఏకంగా ఫోర్బ్స్ మేగజైన్‌లో చోటు సంపాదించాడు. తాజాగా ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన జాబితాలో 2019 సంవత్సరానికిగాను యూట్యూబ్ ద్వారా అత్యధిక పారితోషకం 26 మిలియన్ డాలర్లు(రూ.185 కోట్లు) అందుకున్న వ్యక్తిగా ర్యాన్ కాజీ గుర్తింపు పొందాడు. షియాన్ కాజీ, లోన్ కాజీ దంపతుల ముద్దుల తనయుడైన ఈ ర్యాన్ కాజీ.. 2018లో యూట్యూబ్ చానల్ ద్వారా ఏకంగా 22 మిలియన్ డాలర్లు(రూ.156 కోట్లు) సంపాదించడం విశేషం. ఈ చిన్నోడు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు ర్యాన్ కాజీ పేరు మీద ‘ర్యాన్స్ టాయ్స్ రివ్యూ’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. మొదట్లో ఈ చానల్‌కు అంతగా ఆదరణ లేకపోయినప్పటికీ ర్యాన్ కాజీ పోస్ట్ చేసే వీడియోల వల్ల తరువాత బాగా పుంజుకుంది. తాజాగా ‘ర్యాన్స్ వరల్డ్’గా పేరు మార్చిన ఈ చానల్‌లో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఆట వస్తువులపై(టాయ్స్) ర్యాన్ రివ్యూస్ ఇస్తుంటాడు. ఈ బుడతడు యూట్యూబ్‌లో పోస్ట్ చేసే వీడియోలకు ఎంత క్రేజ్ ఉందంటే… ర్యాన్స్ చానల్‌కు ఇప్పటి వరకు దాదాపు 23 మిలియన్లకు పైగా సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. ర్యాన్ కాజీ పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు ఏకంగా 35 బిలియన్ల వ్యూస్ సాధించాయంటే ఇట్టే అర్థమవుతోంది. దీంతో ఈ బుడ్డోడు ఎనిమిదేళ్ల వయసులోనే యూట్యూబ్ స్టార్‌గా అవతరించాడు. ఇతని వార్షిక ఆదాయం 2019లో 26 మిలియన్ డాలర్లు (రూ.185 కోట్లు)గా ఉంటే, 2018లో 22 మిలియన్ డాలర్లు (రూ.156 కోట్లు)గా ఉంది. అంటే ఏడాది కాలంలోనే ర్యాన్ సంపాదన దాదాపు రూ. 30 కోట్లు పెరిగింది. అందుకే 2019 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోని సంపాదన పరుల జాబితాలో ర్యాన్ కాజీకి కూడా చోటు కల్పించింది.

Related posts