వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌కు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలోని 9 ఎయిమ్స్ సంస్థలకు పార్లమెంట్ నుంచి ఎన్నికలు నిర్వహించారు. గత వారం లోక్‌సభ నుంచి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, సత్యవతి ఎయిమ్స్ సభ్యులుగా ఎన్నికయ్యారు.
తాజాగా విజయసాయిరెడ్డి మంగళగిరి ఎయిమ్స్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైసీపీ లో కీలక నేతగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డిని వివిధ పదవులు వెతుక్కుంటూ వస్తుండటం విశేషం. అయినప్పటికీ సొంత పార్టీలో ఆయనపై సరైన అభిప్రాయం లేకపోవడంతో.. వచ్చిన పదవులు వచ్చినట్టే పోతున్నాయి. త్వరగా నోరుజరే అలవాటు ఉన్న విజయసాయిని నమ్మి ఏ పదవి అప్పజెప్పినా తమకే తిప్పాలని పార్టీ అధిష్టానం భావిస్తుండటంతో.. పెద్దగా సమస్యలు తలెత్తని పదవులను చూసిమరీ ఆయనకు కట్టబెడుతున్నట్టు తెలుస్తుంది!
అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి: కన్నా