telugu navyamedia
సినిమా వార్తలు

వేణుమాధవ్ మృతిపై ఎమోషనల్ అయిన ఎస్వీ కృష్ణారెడ్డి

Venu

ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేప‌టి క్రితం క‌న్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:21 నిమిషాలకు వేణుమాధవ్ తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు. వేణుమాధవ్ మృతిపై ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఎమోషనల్ అయ్యారు. వేణుమాధవ్ ని చిత్ర పరిశ్రమలోకి తీసుకువచ్చిందే ఎస్వీ కృష్ణారెడ్డి. 1996లో సంప్రదాయం చిత్రంలో వేణుమాధవ్ కు ఆయన అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కమెడియన్ గా వేణుమాధవ్ ఇక వెనుదిరి చూసుకోలేదు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. “వేణుమాధవ్ నిన్ననే హాస్పిటల్ లో జాయిన్ అయితే మేమంతా వెళ్లి చూశాం. అప్పటికే డాక్టర్లు కష్టం అన్నట్లుగా చెప్పారు. కానీ వేణుమాధవ్ అవసరం చిత్రపరిశ్రమకు ఇంకా ఉంది. వేణుమాధవ్ ఎలాగైనా కోలుకోవాలని భావించా. కానీ ఈరోజు చేదువార్త వినాల్సి వచ్చింది. నాచేతులతో వేణుని ఇండస్ట్రీకి పరిచయం చేశా. నా కళ్ళముందు ఎదిగిన నటుడు వేణుమాధవ్… అతడి మృతి నాకు ఇంకా నమ్మశక్యంగా లేదు ” అంటూ ఎస్వీ కృష్ణారెడ్డి ఎమోషనల్ అయ్యారు. అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.

ఇక కమెడియన్ అలీ కూడా వేణుమాధవ్ మృతిపై మీడియాతో మాట్లాడుతూ తాను, వేణుమాధవ్ కలసి అనేక చిత్రాల్లో నటించాం. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో హంగామా చిత్రంలో మేమిద్దరం హీరోలుగా నటించడం జరిగింది. గత పదిరోజులుగా వేణుమాధవ్ ఆరోగ్యం సరిగా లేదు. కొన్నిరోజుల క్రితం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మళ్ళీ అనారోగ్యం కావడంతో నిన్న ఆసుపత్రిలో చేరడం.. ఈ రోజు మృతి చెందడం జరిగింది అని అలీ తెలిపాడు.

Related posts