ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మద్రాస్ హైకోర్టులో నోటీసులు జారీ చేసింది. ఐటీ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సరైన వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. రింగ్‌టోన్లు కంపోజ్ చేసి ఇచ్చేందుకు బ్రిటన్‌కు చెందిన టెలికాం కంపెనీతో రెహమాన్ ఒప్పందం చేసుకున్నారు. ఇందు కోసం రూ.3.47 కోట్ల భారీ పారితోషికం తీసుకున్నారు. అయితే ఆ మొత్తాన్ని రెహహాన్ తన ఆదాయంగా చూపించకుండా ట్రస్టుకు బదిలీ చేశారని ఆదాయపన్ను అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఐటీ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తన సేవల ద్వారా పొందిన ఆదాయానికి రెహమాన్ పన్ను కట్టకపోవడం నేరమని అన్నారు. తీసుకున్న పారితోషికానికి సంబంధించి కట్టకుండా ఎగవేతకు పాల్పడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన మద్రాస్ హైకోర్టు రెహమాన్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
previous post
పోటీ సినిమా పరంగానే… వ్యక్తిగతంగా కాదు… మోహన్ లాల్ పై మమ్ముట్టి వ్యాఖ్యలు