telugu navyamedia
సినిమా వార్తలు

దంగల్ vs కేజీఎఫ్‌ 2 రికార్డ్‌ ను బ్రేక్‌.

రూ. 330 కోట్ల వసూళ్లు రాబట్టిన కే జి ఎఫ్ 2 ఏకంగా దంగల్ రికార్డు ను కూడా బ్రేక్‌ చేసింది.
కే జి ఎఫ్ 2 రికార్డుల వేట కొనసాగుతోంది. ఒక సౌత్ సినిమా ఉత్తర భారతంలో ఎప్పుడు సాధించిన రికార్డులను నమోదు చేసిన కేజీఎఫ్‌ ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. తాజాగా నార్త్ ఇండియా లో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమా గా కేజిఎఫ్ 2 నిలిచింది. ఇప్పటి వరకు హిందీ సినిమా దంగల్ అత్యధిక వసూళ్ల రికార్డు ను సొంతం చేసుకుంది. కానీ గతం లో ఏ సౌత్ సినిమా.. హిందీ సినిమా దంగల్‌ స్థాయిలో కే జి ఎఫ్ 2 సినిమా వసూళ్లు నమోదు చేయలేదు.

ఇప్పటి వరకు దంగల్‌ రికార్డు ను ఏ హిందీ సినిమా కూడా బ్రేక్ చేయలేక పోయింది. ఒక సౌత్ సినిమా.. అది కూడా కన్నడ సినిమా దంగల్‌ రికార్డు చేయడం చూస్తే కే జి ఎఫ్ 2 ప్రభావం అక్కడ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. యశ్‌ మరియు ప్రశాంత్ కాంబోలో తెరకెక్కిన కే జి ఎఫ్ 2 భారీ వసూళ్లు నమోదు చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే కే జి ఎఫ్ 3 సినిమా కూడా ప్రారంభం కాబోతోందని కన్నడ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కేజీఎఫ్‌ ఈ స్థాయిలో వసూళ్లు నమోదు చేయడం పట్ల బాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో వస్తున్న వసూళ్ల ను చూసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related posts