telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

దృశ్యం 2 రీమేక్ లో వెంకటేష్…

మోహన్ లాల్ సినిమా అంటేనే ప్రత్యేక స్థాయి ఉంటుంది. అతడు నటించిన మలయాళ సినిమా దృశ్యం బ్లాక్ బాస్టర్‌గా రికార్డులు తిరగరాసింది. తన భాషలోనే కాకుండా ఇరుగు పొరుగు భాషల్లో కూడా సంచలనాలు చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనాలు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో కూడా భారీ హిట్ అయింది. అయితే ఈరోజు ఈ సినిమా సీక్వెల్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది. దృశ్యం సినిమాలో హీరో తన తెలితేటలతో తన కుటుంబంపై హత్యా నేరం పడకుండా కాపాడతాడు. తన భార్య, పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పోలీసులను, వ్యవస్థను తప్పు దోవ పట్టిస్తాడు. ఇలాంటివి ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. అన్నింటిని కలిపి ఎంతో వినోదాత్మకంగా నిర్మించారు. ఇక దృశ్యం 2 సరిగ్గా మొదటి భాగం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుండే ప్రారంభం అవుతుంది. అయితే ఈరోజు విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మళ్ళీ దానిని రీమేక్ చేయాలని వెంకటేష్ నిర్ణయిచుకున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ లో అజయ్, టబు రీమేక్ చేస్తుండగా ఇంకడా మళ్ళీ వెంకటేష్, మీనా చేయనున్నారు.

Related posts