telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ ను కుదిపేస్తున్న కరోనా.. అల్లు అర్జున్ కు పాజిటివ్

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీ లో ఇప్పటికే పలుగురు స్టార్లకు కరోనా సోకగా..తాజాగా అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తాను హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని.. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తన ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందవద్దని… త్వరలోనే తాను కోలుకుంటానని తెలిపారు.

Related posts