telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆక్లాండ్‌ : … రోహిత్‌శర్మ .. అద్భుత క్యాచ్‌ …

rohit sharma catch viral

టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో సూపర్‌ మ్యాన్‌గా మారాడు. లక్ష్య ఛేదనలో నిరాశ పర్చిన అతడు అంతకుముందు కివీస్‌ బ్యాటింగ్‌లో ఫీల్డర్‌గా కనువిందు చేశాడు. 8వ ఓవర్‌ వేసిన శివమ్‌ దూబె బౌలింగ్‌లో గప్తిల్‌ డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా భారీ షాట్‌ కొట్టాడు. అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ బౌండరీ అవతల పడుతున్న బంతిని.. ఒంటి కాలుపై నిలబడి క్యాచ్‌ అందుకున్నాడు. కాగా, రోహిత్‌ అదే సమయంలో బ్యాలెన్స్‌ తప్పడంతో బంతిని గాల్లోకి వదిలి, తాను కుదురుకున్నాక క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో గప్తిల్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Related posts