telugu navyamedia
క్రీడలు వార్తలు

ఉమెన్స్ ఐపీఎల్ : విజయం మిథాలీ సేనదే..

షార్జా ఈ రోజు వేదికగా ఉమెన్స్ ఐపీఎల్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో సూపర్నోవాస్-వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. అయితే టాస్ గెలిచిన వెలాసిటీ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బౌలింగ్ ఎంచుకోవడంతో హర్మన్‌ప్రీత్ కౌర్ న్యాయకత్వం లోని సూపర్నోవాస్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే సూపర్నోవాస్ బ్యాట్స్మెన్స్ లలో చమరి అథపత్తు (44), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (31) తో ఆకట్టుకోవడంతో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసింది. ఇక 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన మిథాలీ సేన మొదట తడబడింది. 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ తర్వాత వేద కృష్ణమూర్తి (29) సుష్మ వర్మ(34), సునే లూస్(37*) రాణించడంతో 19.5 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాంతో ఈ ఏడాది ఉమెన్స్ ఐపీఎల్ లో మొదటి విజయం నమోదు చేసింది మిథాలీ సేన. అయితే ఈ లీగ్ లో కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే ఉండటంతో కప్ అందుకోవాలంటే జట్లకు ప్రతి మ్యాచ్ కీలకమే.

Related posts