telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రగతి భవన్ కు కాంగ్రెస్ నేత వీహెచ్.. అసలు కారణం ఇదే

కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఇవాళ ప్రగతి భవన్ కు వచ్చారు. తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ సందర్బంగా హన్మంతరావు మాట్లాడారు. కరోనాతో చనిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇవ్వబోడని…సమస్యలపైన సీఎంకు ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదని ఫైర్ అయ్యారు. సిఎం కెసిఆర్ నిలదీసేందుకే ప్రగతి భవన్ కు వచ్చానని విహెచ్ పేర్కొన్నారు.

Related posts