telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విలన్‌గా మారిపోయిన మెగా బ్రదర్‌ !

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మంచి న‌టుడిగా, నిర్మాత‌గా అందరికీ సుపరిచితులే. అంతేకాదు జబర్దస్త్ జ‌డ్జ్‌గా బుల్లితెర ప్రేక్షకులను అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. జబర్ధస్త్‌ షోతో‌ నాగబాబు ఫేట్‌ మారిపోయింది. ఈ షోకు జడ్జిగా వ్యవహరించిన నాగాబాబు మెల్లమెల్లగా ఇతర కార్యక్రమాలకు సైతం జడ్జిగా ఉంటూ అందరినీ అలరించారు. అయితే.. ఇన్నాళ్లు జడ్జిగా అలరించిన నాగబాబు ఇప్పుడు మళ్లీ నటుడిగా అలరించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నాగాబాబు రఫ్‌ లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది ఫ్యాన్స్‌కు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏ సినిమా కోసం నాగబాబు ఇలా మారాడో తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. ఏదైనా సినిమాలో విలన్‌ పాత్రలో నాగబాబు నటిస్తున్నాడా ? అనే సందేహం అందరికీ వస్తోంది. ఎందుకంటే ఈ లుక్‌లో నాగబాబు.. గెటప్‌ చాలా భయంకరంగా ఉంది. సిగరెట్‌ కాలుస్తూ, మొఖంపైన గాట్లతో నాగబాబు కనిపిస్తున్నాడు. అయితే.. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related posts