telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న “లైఫ్ ఆఫ్ జోహార్” వీడియో

Johaar

తేజ మార్ని ద‌ర్శ‌క‌త్వంలో బ్యూటిఫుల్ ఫేం నైనా గంగూలీ, దృశ్యం ఫేమ్ ఎస్త‌ర్ అనీల్‌, సీనియ‌ర్ న‌టి ఈశ్వ‌రీరావు, రోహిణి, శుభలేఖ సుధాకర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం “జోహార్”. ధ‌ర్మ సూర్య పిక్చ‌ర్స్ ప‌తాకంపై భాను సందీప్ మార్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ వీడియోని కొద్ది సేప‌టి క్రితం మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ వీడియో చూస్తుంటే సినిమా మొత్తం ఐదు పాత్ర‌ల చుట్టూ తిరుగుతున్న‌ట్టు అర్ద‌మ‌వుతుంది. చిత్రానికి ప్రియదర్శన్‌ సంగీతమందించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అతి త్వ‌ర‌లోనే చిత్ర రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నారు. తాజాగా విడుద‌లైన వీడియోను మీరు కూడా వీక్షించండి.

Related posts