telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : రామ్ చరణ్, అలియా లుక్స్ లీక్

RRR

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా అలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కి జోడీగా ఓలివియా మోరిస్‌పై స‌నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చితాన్ని వచ్చే ఏడాది 2021, జనవరి 8న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌రకు ఒక్క లుక్ కూడా విడుద‌ల కాక‌పోవ‌డంతో సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా గ‌మనిస్తున్నారు. కొమురం బీమ్‌గా ఎన్టీఆర్‌.. అల్లూరి పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తోన్న సంగ‌తి కూడా తెలిసిందే. జ‌న‌వ‌రి 8న ప‌ది భాష‌ల్లో సినిమా విడుద‌ల కానుంది. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజమౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంత సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు సీత పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. కాగా.. ‘ఆర్ఆర్ఆర్‌’లో చ‌ర‌ణ్‌, ఆలియా లుక్స్ ఇవేనంటూ సోష‌ల్ మీడియాలో ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. బ్రిటీష్ సైనికాధికారి పాత్ర‌లో చ‌ర‌ణ్‌, పాత‌కాలం చీర‌క‌ట్టులో ఆలియాభ‌ట్ క‌న‌ప‌డుతున్నారు. మ‌రి ఈ ఫొటోలు లీకుల ప‌ర్వంలో భాగంగా ఏమైనా లీక‌య్యాయా? లేక డిడ్ ఫ్యాన్ మేడ్ పోస్టరా ? అనేది తెలియాల్సి ఉంది.

Related posts