telugu navyamedia
రాజకీయ

జూన్ 10 రాజ్య‌స‌భ ఎన్నిక‌లు : మంత్రి కిషన్ రెడ్డికి క‌ర్ణాట‌క‌లో కీలక బాధ్యతలు

రాజ్యసభ ఎన్నికల జరగనున్న వేళ బీజేపీ అధిష్టానం కేంద్ర పర్యాటక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి  కీలక బాధ్యతలు అప్పగించింది. మంత్రి కిషన్ రెడ్డిని కర్నాటక రాజ్యసభ ఎన్నికల ఇంంఛార్జ్ గా నియమించారు.

అదే విధంగా మరో మూడు రాష్ట్రాల రాజ్యసభ ఎన్నికలకు కూడా నియ‌మించింది. రాజస్థాన్‌కు నరేంద్ర సింగ్ తోమర్, హర్యానాకు గజేంద్ర సింగ్ షెకావత్, మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్‌ను నియమించారు.

దేశంలోని 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. 

కర్ణాటక విషయానికి వస్తే.. కాంగ్రెస్ బీజేపీలు అద‌న‌పు అభ్య‌ర్ధుల‌ను రంగంలోకి దింపాయి. నాలుగు బెర్త్‌లు ఉన్న కర్ణాటకలో మంత్రి నిర్మలా సీతారామన్, కన్నడ సినీ నటుడు జగ్గేష్‌లను తన ప్రాథమిక అభ్యర్థులుగా నిలబెట్టింది. మూడో అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు అయిన లహర్ సింగ్ సిరోయాను బరిలో నిలిపింది.

ఇక‌ 69 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను బరిలో దింపింది. సీనియర్‌ నేత, సిట్టింగ్ ఎంపీ జైరాం రమేష్, రాజ్యసభ మాజీ ఎంపీ కె. రెహమాన్ కుమారుడు మన్సూర్ అలీఖాన్‌లను కాంగ్రెస్ బరిలో నిలిపింది.

మ‌హారాష్ర్ట‌లో మ‌హా వికాస్ అఘాడి మూడు భాగ‌స్వామ్య పార్టీలు కాంగ్రెస్ అభ్య‌ర్థి ఇమ్రాన్ ప్ర‌తాప్‌గ‌ర్హి ప‌ట్ల అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ శివ‌సేన పార్టీ రాష్ర్టం నుంచి ఒక‌రిని రంగంలోకి దింపాల‌ని అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

రాజ‌స్థాన్‌లో పోటీ అత్యంత ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటుంద‌ని అభిప్రాయం. రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ విదేయుడు ర‌ణ‌దీప్ సింగ్ సూర్జేవాలా ప్ర‌మోద్ తివారీ, ముకుల్ వాస్నిక్‌ల‌ను రంగంలోకి దింపింది. అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వ ఎమ్మెల్యేల‌తో పాటు ముగ్గురు స్వ‌తంత్ర ఎమ్మెల్యేల ఓట్లు తివారికీ అవ‌సరం. గెహ్లాట్ ఇప్ప‌టికే విశ్వాసం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని పేర్కొన్నారు. రాజ‌స్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ 108 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా , బీజేపీ 71 మంది ఉన్నారు.

మరి.. కర్ణాటకలో మూడు రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తున్న వేళ.. కిషన్ రెడ్డి అక్కడ తనకు అప్పగించిన బాధ్యతలను ఏ విధంగా పూర్తిచేస్తారో చూడాలి. 

Related posts