telugu navyamedia
రాజకీయ

తెలంగాణ గ్రేటర్‌ కాలుష్యం బంపర్ ఆఫర్.. 10000 నజరానా.. 

huge job notification in telanganaf
కాలుష్య నియంత్రణపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) దృష్టిసారించింది. జల, వాయు, శబ్ధ కాలుష్యం, ఘన, రసాయన వ్యర్థజలాల అక్రమ డంపింగ్‌లు పార బోతలకు అడ్డుకట్ట వేసేందుకు వినూత్నంగా పంథాను ఎంచుకుంది. కాలుష్యానికి కారకులైన వారి సమాచారమిచ్చిన వారికి నజరానాను ప్రకటించింది. ఉల్లంఘనుల గురించి ఉప్పందించిన వారికి రూ. 10 వేల ప్రొత్సాహాకాన్ని ప్రక టించింది. ఇది వరకు నజరానా రూ 3 వేలు మాత్రమే ఉం డగా, దానిని రూ. 10 వేలకు పెంచడమే కాకుండా, ఫిర్యా దులు చేసేందుకు వీలుగా మొబైల్ నెంబర్లు, ఈ మేయిల్ ఐడీలను సైతం ప్రకటించింది.
గ్రేటర్‌లో కాలుష్యం రోజురోజు పంజా విసురుతున్నది. రసాయన వ్యర్థజలాల పారబోతలు, అక్రమ రవాణా, డంపింగ్‌లు యథేచ్ఛగా సాగుతున్నాయి. విషవాయువులను నేరుగా గాల్లోకి వదిలేయడం, ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం, కాల్చివే య డం జరుగుతున్నది. వాస్తవికంగా ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఇలా చేయడం పర్యావరణ చట్టాల ప్రకారం చట్ట విరుద్ధం. ఇలా చేసిన వారిపై పీసీబీ కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఇందుకు కారకులైన కంపెనీలను మూసివేసిన ఘటనలు ఉన్నాయి. కాని నిఘా లేక పోవడంతో గ్రేటర్‌లోని పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు ఇష్టారీతిన వ్యవహారిస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి. 
ఇలాంటి ఉల్లంఘనుల జరుగుతున్న ప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వారిపైనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీని తో దొరికిన వారు దొంగ లేదంటే దొర అన్నట్లుగా సాగుతున్నది. ఇలాంటి ఉల్లంఘనులకు చెక్‌పెట్టేందుకు పీసీబీ ఈ తరహా వ్యుహాన్ని ఎంచుకున్నది. పీసీబీకి సమారమిచ్చిన వారికి రూ. 10 వేల ప్రొత్సాహాకాన్ని ఇస్తామని, సమాచారమి చ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి తెలిపారు.
సమాచారమివ్వాల్సిన అధికారులు ..వారి మొబైల్ నంబర్లు :
సభ్యకార్యదర్శి వి. అనిల్‌కుమార్ : 90005 51355 చీఫ్ ఇంజినీర్ విశ్వనాథం : 99490 78336 రమేష్‌గుప్తా : 91773 03206 మేయిల్‌ఐడీ:ms-tspcb<\@>telangana.gov.in

Related posts