telugu navyamedia
రాజకీయ

ప్రధాని గారూ, ఇది సినిమా కాదు, ఈనాటి కాశ్మీర్ వాస్తవికత..

జ‌మ్మూకాశ్మీర్ లో క‌శ్మీరీ పండిట‌క‌ల‌పై ఉగ్ర‌వాదుల దాడులు, హ‌త్య‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. కాశ్మీరీ పండిట్లు 18 రోజుల నుండి ధర్నా చేస్తుంటే.. బీజేపీ 8 సంవత్సరాల సంబరాలలో బిజీగా ఉందని రాహుల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“కశ్మీర్‌లో గత 5 నెలల్లో 15 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 18 మంది పౌరులు మరణించారు . నిన్న కూడా ర‌జ‌నీబాల‌ అనే టీచర్ హత్యకు గురయ్యాడు. ప్రధాని గారూ, ఇది సినిమా కాదు, ఈనాటి కాశ్మీర్ వాస్తవికత” అని గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

Related posts