మనం చూసిన ఏ నగరం అయిన ప్రజలతో కిటకిటకాలాడుతున్నది. నగరాల్లో జాగా సరిపోక చాలామంది శివరాల్లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తూర్పు మధ్యదరా సముద్రంలోని సైప్రస్ దీవిలోని ఫమగుస్టా అనే నగరం ఉన్నది. సముద్ర తీరంలో ఉండే ఈ నగరంలో ఆకాశాన్ని తాకే భవనాలు ఉన్నాయి. అన్ని వసతులతో అద్భుతంగా ఉంటుంది. ఈ నగరంలో వరోషా పేరుతో ఓ ప్రాంతం ఉన్నది. సముద్ర తీరంలో ఉండే ఈ ప్రాంతంలో అనేక భవనాలు ఉన్నాయి. రోడ్లు, చెట్లు ఉన్నాయి. కానీ, ఆ ప్రాంతంలో ఒక్క మనిషి కూడా కనిపించడు. నివసించడు. ఆ ప్రాంతం చుట్టూ మూళ్ళ కంచెలు, బారీకేడ్లు పెట్టి ఉంటాయి. నిత్యం సైన్యం, పోలీసులు పహారా కాస్తుంటారు. 1970 వరకు ఈ ప్రాంతం టూరిస్టులకు స్వర్గధామంగా ఉండేది. దీనిపై టర్కీ కన్నేసింది. అయితే, ఈ నగరంలో గ్రీస్ దేశానికీ చెందిన ప్రజలు అధికంగా నివసిస్తుంటారు. 1974లో టర్కీ సైన్యానికి, ఫమగుస్టా నగరంలోని గ్రీస్ ప్రజలకు మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఫమగుస్టా నగరంలోని వరోషా ప్రాంతం టర్కీ ఆధీనంలోకి వెళ్ళింది. అప్పటికే అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడంతో ఇప్పటికి ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది.
previous post
టీడీపీని స్టోర్ రూమ్ లో పెట్టడం ఎవరి వల్లా కాదు: దేవినేని