telugu navyamedia
రాజకీయ వార్తలు

ఏ విద్యార్థి కూడా కరోనా బారిన పడకూడదు: ఉద్ధవ్ థాకరే

uddhav-thackeray-shivasena

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. శివసేన అధికార మీడియా ‘సామ్నా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు ఎలాంటి పరీక్షలను నిర్వహించలేమని చెప్పారు. ఏ విద్యార్థి కూడా కరోనా బారిన పడకూడదని తెలిపారు. నా కళ్ల ముందే నా ప్రజలు ఇబ్బంది పడటాన్ని నేను చూడలేనని అన్నారు.

కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని స్వదేశంలోనే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. వైరస్ ను కట్టడి చేయడం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదనే విమర్శలు ఉన్నాయి. తాను ట్రంప్ మాదిరి విఫలం చెందలేదనే విషయాన్ని ఉద్ధవ్ ఇంటర్వ్యూలో చెప్పారు. లాక్ డౌన్ ఇప్పటికీ అమల్లో ఉందని తెలిపారు.

Related posts