telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం సూపర్‌ : కేంద్ర మంత్రి కితాబ్‌

కొవిడ్ 19 ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ఈ సందర్భంగా కేంద్రమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. పలు అంశాల్లో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను అభినందించారు కేంద్ర మంత్రి. తెలంగాణ ప్రభుత్వ చర్యలు భేష్‌ అంటూ కితాబ్‌ ఇచ్చారు. అయితే…దీనిపై మంత్రి ఈటల రాజేందర్ గారు మాట్లాడారు. ఇప్పటి వరకు తెలంగాణ లో 48 లక్షల టెస్టులు చేయడం జరిగిందని..అందులో 5 శాతం మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. 2. 5లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 19వేల ఆక్టీవ్ కేసులు ఉన్నాయని…డెత్ రేట్ 0.55 శాతంగా ఉంది అని మంత్రి పేర్కొన్నారు. జిల్లా హాస్పిటల్స్ మరియు CHC, PHC,సబ్ సెంటర్స్ అన్ని చోట్లా కరోనా టెస్టులు చేస్తున్నామని.. తెలంగాణలో ఆక్సిజన్ కొరతలేదన్నారు. ముందు ముందు రోజుల్లో కరోనా కేసులు పెరిగినా కూడా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నామని పేర్కొన్నారు.

Related posts