సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తామని ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు భయపడబోమని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. త్రిసభ్య కమిటీకి ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా తూతూ మంత్రంగా ప్రభుత్వం చర్చలు జరిపిందని వెల్లడించింది.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మెను కొనసాగిస్తామని తెలంగాణ ఆర్టీసీ జేసీఏ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పునరుద్ఘాటించారు.
హయత్‌నగర్‌లో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులని కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్న కార్మికులపై చర్యలు తీసుకోవడానికి తమవి ఎవరి దయాదాక్షిణ్యాల మీద వచ్చిన ఉద్యోగాలు కావని అన్నారు. విధులకు హాజరు కానీ కార్మికులను తొలగించాలనుకుంటే మొదట తనను ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతి రోజు మంచి ప్రణాళికతో శాంతియుతంగా సమ్మెను చేస్తామని తెలిపారు.

