కూకట్పల్లి సామూహిక అత్యాచారం అత్యాచారం కేసులో పురోగతి సాధించారు పోలీసులు. కూకట్పల్లి హోటల్లో అమ్మాయి పై రేప్ చేసిన ఘటన అందరికి తెలిసిందే. అయితే ఆ అమ్మాయి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు కూకట్పల్లి పోలీసులు. కేకు లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసారు ముగ్గురు యువకులు. యువతిపై అత్యాచారం పాల్పడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ ముగ్గురు దగ్గర నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. యువతి ఫిర్యాదు చేయగానే రంగంలోకి ప్రత్యేక బృందాలు వచ్చాయి. ఈ కేసు లో బాధితురాలు స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు పోలీసులు. 3 నెలల క్రితం జోసెఫ్ నాకు పరిచయమయ్యాడు. బర్త్ డే ఉందని నన్ను తీసుకెళ్లారు. కేక్ తిన్న తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు.జరిగిన ఘటనను ఎవరికైనా చెబుతే చంపేస్తామని బెదిరించారు. ఇంటికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది నిందితులకు కఠిన శిక్ష పడాలి అని అత్యాచార బాధితురాలు తెలిపింది.
previous post