ఎంపీ రఘు రామకృష్ణ రాజు మరోసారి సంచలన వాక్యాలు చేశారు. న్యాయవ్యవస్థ పై ప్రభుత్వ దాడి సరికాదని..రాజధాని భూముల్లో “ఇన్ సైడర్ ట్రేడింగ్” జరగలేదని రఘు రామకృష్ణ రాజు అన్నారు. న్యాయ వ్యవస్థ పై దాడిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయని..న్యాయవ్యవస్థ పై దాడి కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారు పదవుల్లో ఉండే అర్హత కోల్పోతారని..ముఖ్యమంత్రి తన పదవి కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇప్పటికైనా తప్పుడు సలహాదారులను ముఖ్యమంత్రి తొలగించాలని.. తప్పు జరిగిందని భావించి క్షమాపణలు చెప్తే ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రిని నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు….పార్టీ హితం కోరే చెప్తున్నాని తెలిపారు. నేను ముఖ్యమంత్రిని ప్రేమిస్తున్నా…సలహాదారులు ముఖ్యమంత్రికి పనికిమాలిన సలహాలు ఇవ్వడం మనేయాలని సూచించారు. న్యాయ వ్యవస్థకు క్షమాపణలు చెప్పి, ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగాలనుకుంటున్నానని తెలిపారు. లేదంటే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని సిద్ధం చేసుకోండన్నారు. ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిగా కూడా రెడ్డీలే ఉంటారు..విజయమ్మ, భారతి కూడా ముఖ్యమంత్రి కావచ్చన్నారు.