telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేపాల్ ను ముంచెత్తుతున్న .. భారీ వర్షాలు… 43 మృతి..

43 died in nepal on huge rains

భారీ వర్షాలతో వరదలు రావడంతో .. నేపాల్‌ ప్రజల జీవితం అతలాకుతలం అవుతుంది. గడచిన 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురవడంతో వరదనీటి ధాటికి 43 మంది మరణించారు. మరో 24 మంది గల్లంతయ్యారు. శనివారం ఉదయం మరో పది మంది గల్లంతయ్యారు. వరదనీటిలో చిక్కుకున్న 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నేపాల్ లో గతకొన్ని రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరు పోటెత్తడంతో పలు ప్రాంతాల్లో రోడ్లు, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వాగులు, వంకలు పొంగి, పొర్లుతున్నాయి. రెస్క్యూ టీమ్స్ ఎప్పటికప్పుడు పరిస్థితి చేయి దాటకుండా పూర్తి సహయక చర్యలు చేపడుతున్నారు. దాదాపు 6000 మంది ఈ వరదల వల్ల ఇండ్లను కోల్పోయి..నిరాశ్రయులగా మారారని అక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు.

Related posts