ఏపీలో సబ్సీడి విత్తనాల కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఖరీప్ సీజన్‌లో వేరుశనగ, పత్తి విత్తనాలతో పాటు ఇతర విత్తనాలు తక్షణమే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. విత్తనాల కోసం కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
ఖరీప్ సీజన్‌లో విత్తుకు పదను దాటిపోతోందని ఇంకెప్పుడు విత్తనాలు పంపిణీ చేస్తారని అధికారులను నిలదీస్తున్నారు. సోమవారం రాయలసీమ జిల్లాల్లో ఆందోళనను మరింత ఉధృతం చేశారు. అనంతపురం, విజయనగరం, నెల్లూరులో విత్తనాలో జగన్ అంటూ రోడ్డెక్కుతున్నారన్నారు. రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం ఎదురు చూపులని రైతులు వాపోయారు.
పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు ‘కిక్’ ఇస్తున్నాయి: రేవంత్ రెడ్డి