telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ షాక్..అడ్వాన్స్ టికెట్‌ రిజర్వేషన్‌ చార్జీలు పెంపు

*పెరిగిన  తెలంగాణ ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ ఛార్జీలు
*గతనెల 27 నుంచి పెంచిన ధరలు వసూలు చేస్తున్న ఆర్టీసీ
*గతంలో రూ.20 ఉండగా మరో రూ.10 పెంచిన ఆర్టీసీ
*ప్రస్తుతం రిజర్వేషన్‌కు రూ.30 వసూలు చేస్తున్న ఆర్టీసీ

తెలంగాణ ప్రయాణీకులకు టీఎస్ ఆర్టీసీ మరో షాక్ ఇచ్చింది. అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ చార్జీలు పెంచి ప్రయాణీకులపై మరో భారాన్ని మోపింది. రిజర్వేషన్ చార్జీలపై రూ.10లు పెంచింది. ఒక్కో రిజర్వేషన్ పై రూ.20 రూపాయల నుండి 30 రూపాయలకు పెంచింది టీఎస్ ఆర్టీసీ. పెంచిన చార్జీలు మార్చి 27 నుంచే అమలు కానున్నాయి.

దీంతో సామాన్య ప్ర‌జ‌లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే పెంచిన చార్జీలతో సతమతమవుతుంటే ఇప్పుడు రిజర్వేషన్ చార్జీలు కూడా పెంచటం ఇంకాస్త భారమైంది అని వాపోతున్నారు.

వారం రోజుల క్రితం డీజిల్‌ సెస్ పేరుతో టీఎస్‌ఆర్టీసీ చార్జీలను పెంచారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో 2 రూపాయలు.. ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో రూ.5 పెంచారు. డీజిల్‌ సెస్ పేరుతో పెరిగిన బస్సు చార్జీలు రేపటి నుంచి అమలులోకి వస్తాయి. అంతలోనే మరోసారి చార్జీలు పెంచి అందరికీ టీఆర్‌ఆర్టీసీ షాకిచ్చింది

కాగా.. రిజర్వేషన్ చార్జీలు పెంచిన టీఎస్ ఆర్టీసి ఇప్పటి వరకు పెరుగుదలపై అధికారిక ప్రకటన చేయలేదు.

Related posts