telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే: కిషన్‌రెడ్డి

kishanreddy on ap capital

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన కారణంగా వలస కార్మికులు, ఇతర ప్రాంతాల విద్యార్థులు ఎటూ వెళ్లలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారి ఆలనాపాలనా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.కార్మికులను పనిచేసే చోట ఉండనివ్వడం లేదని, సొంతూర్లకు వెళ్లేందుకు మార్గం లేదని, దీంతో ఆకలితో అలమిటిస్తున్నారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

పలు నగరాల్లో చదువుకుంటున్న విద్యార్థులను వసతి గృహాల నిర్వాహకులు బయటకు పంపేస్తుండడంతో వారు కూడా దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగిన సౌకర్యాలు కల్పించవలసిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు భారత ప్రభుత్వ హోం శాఖ సూచనలు జారీ చేసింది.

Related posts