*ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులు..
*ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు సహకరించాలి..
*ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టాం..
తెలంగాణలో పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం అయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ర్టంలో 41,392 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. దీంతో హుషారుగా బ్యాగులు, పుస్తకాలు చేతబట్టి తరగతులకు వెళ్లారు.
కాగా.. స్కూల్స్ రీఓపెన్ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఉదయం నగరంలోని మెహబూబియా స్కూల్‌ను సందర్శించారు. స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్ కమ్ చెప్పారు.
అనంతరం సబితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ…మొదటి రోజు స్కూల్స్‌కు పిల్లలు ఉత్సాహంగా వచ్చారని అన్నారు. మన ఊరు మనబడి కింద స్కూళ్లను డెవలప్ చేస్తున్నామన్నారు. 9 వేల కోట్లతో 26 వేల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ఇంగ్లీషు మీడియా మొదలు పెట్టామని… ప్రైవేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ బడులు ఉంటాయన్నారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియా ప్రవేశ పెట్టిన సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
రైతు సమస్యల ప్రస్తావనే లేదు.. రాష్ట్రపతి ప్రసంగంపై ఉత్తమ్ విమర్శలు