టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే కొంతమంది లిస్ట్ అవుట్ చేసిన ఈడీ అధికారులు ఒక్కరిని విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి, నిర్మాత ఛార్మి ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆమెను ఈడీ అధికారులు విచారించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ లింకులపై వివరాలు తెల్సుకున్నట్టు సమాచారం.
డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్ గా మారి ఇచ్చిన సమాచారంతో.. ఛార్మిని ప్రశ్నించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఛార్మిని అడిగినట్టు సమాచారం అందుతోంది. 2015-17 వరకు జరిగిన బ్యాంక్ లావాదేవీల వివారాలను ఆమె ఈడీకి సమర్పించినట్లు తెలుస్తోంది.
ఈడీ విచారణ తర్వాత.. మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు ఛార్మి. ఈడీ అధికారులు అడిగిన పత్రాలు అన్ని సమర్పించాను. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. ఈడి విచారణ కు పూర్తి గా సహరించాను. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేను అంటూ చెప్పుకొచ్చింది. నన్ను అడిగిన బ్యాంక్ డాక్యుమెంట్లు అన్ని ఈడీ అధికారులకు అందజేశాను. ఈడీ అధికారులు ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన నేను సహకరిస్తున్న. కేసు దర్యాప్తు కొనసాగుతుంది, నేను ఎక్కువ మాట్లాడలేను అని అంది చార్మి.
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్, ఛార్మి ఫిలిం బ్యానర్ల బ్యాంక్ ఆడిట్ రిపోర్టులను పరీశీలించారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఈ కేసు విచారణ క్రమంలో తొలిరోజు పూరీ జగన్నాథ్ ను ప్రశ్నించి వివరాలు రాబట్టారు అధికారులు.
ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజతోపాటు డ్రైవర్ శ్రీనివాస్, నవ్‌దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్‌లకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే!
మీకేం పోయేకాలం… బాహుబలి తరువాతే కదరా మీరిద్దరూ… హీరోలపై తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు