ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేర్వేరుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని పెనమలూరులో తన పర్యటనను ప్రారంభించనున్నారు,
అక్కడ వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి స్థానిక రైతులతో నేరుగా మాట్లాడ నున్నారు.
అనంతరం రెవెన్యూ సదస్సులో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారాం రాజు జిల్లా లోని కొన్ని మన్యం ప్రాంతం లో పర్యటించ నున్నారు.
తన పర్యటనలో భాగంగా బాగుజోలలో కొత్త రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ స్థానిక గిరిజన సంఘాలతో ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ లో పాల్గొంటారు.
తన కార్యక్రమాలను ముగించుకుని సాయంత్రం తిరిగి గన్నవరం వెళ్లే ముందు విశాఖపట్నం చేరుకుంటారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది, ఆయన రాకను పురస్కరించుకుని జనసేన నేతలు పలు కార్యక్రమాలను సిద్ధం చేశారు.


జగన్ గారూ మీరు ఏపీకి సీఎం.. సాక్షి పేపర్ చదవడం మానేయండి?: నారా లోకేశ్