telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అందుకోసం ఓ కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం…

మన దేశంలో కరోనా ఇంకా వ్యాపిస్తునే ఉంది. అయితే ఈ వైరస్ నియంత్రణా చర్యలను సిఫార్సు చేసేందుకు రాష్ట్ర ఎపిడెమోలోజికల్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి సహా 9 మంది వైద్య నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. అయితే రాష్ట్రంలో 8 లక్షల 76 వేల 336 మంది ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడినట్టు పేర్కోన్న ప్రభుత్వం. ఇందులో 8 లక్షల 64 వేల మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వెల్లడి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కోటి 9 లక్షలకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు పేర్కోన్న ప్రభుత్వం. ప్రజారోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవటంతో పాటు కోవిడ్ విస్తృతిని పసిగట్టి అందుకు అనుగుణంగా నియంత్రణా చర్యలు చేపట్టేలా కమిటీకి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. కోవిడ్ మహమ్మారి మరింత విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనుంది ఈ కమిటీ. నమూనాల సమాచార సేకరణ, విశ్లేషణ, ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాల అమలు, రాష్ట్రంలో క్షేత్రస్థాయి వరకూ సాంకేతిక సామర్ధ్యాల పెంపు , నిపుణుల నియామకం , వైద్య సిబ్బంది  నియామకాలు, ముందస్తు హెచ్చరికల వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవటం వంటి బాధ్యతల్ని కమిటీకి అప్పగించింది ప్రభుత్వం. మరి ఇది ఎంతమేర పనిచేస్తుంది అనేది చూడాలి.

Related posts