telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఉపాధి కోర్సుల్లో బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

bridge lab for training on coding

పదో తరగతి పాసైన బీసీ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఉపాధి కోర్సుల్లో సెట్విన్‌ కేంద్రంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. హైద్రాబాద్ ముషీరాబాద్‌ సెట్విన్‌ కేంద్రంలో పదో తరగతి పాసైన బీసీ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెట్విన్‌ ఇన్‌చార్జి మీర్‌ మహ్మద్‌ అలీ తెలిపారు.

శనివారం భోలక్‌పూర్‌లోని సెట్విన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్‌, రిఫ్రిజిరేషన్‌ ఏయిర్‌ కండీషనింగ్‌, బ్యూటీషియన్‌, కంప్యూటర్‌ కోర్సు, ఫ్యాషన్‌ డిజైయినింగ్‌ కోర్సులలో 3 నుంచి 6 నెలల కాలపరిమితితో కూడిన ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థినీ విద్యార్థులు 3వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు 040-27532709 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts