తిరుపతి దేవస్థానానికి రోజు లక్షలలో భక్తులు వస్తుంటారు. దీనితో ఎప్పుడు రద్దీగా ఉండే తిరుపతి రైల్వే స్టేషన్ కొత్త సోయగాలతో ప్రయాణికులను స్వాగతం పలుకుతుంది. అసలు అది రైల్వే స్టేషనా లేక స్టార్ హోటలా అన్నట్టుగా తీర్చిదిద్దారు. తిరుపతికి వచ్చి వెంకన్నను దర్శించుకునే భక్తులకు ఇదో సర్ ప్రయిజ్. ‘అతిథి’ ప్రీమియమ్ లాంజ్ ని తిరుపతి స్టేషన్ లో అందుబాటులోకి తెచ్చారు.
దీన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్టు, కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయల్ పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన ట్వీట్ లో ‘అతిథి’కి సంబంధించిన ఫోటోలను ఆయన పంచుకున్నారు. ఇక్కడ సౌకర్యవంతమైన రీక్లయినర్ సీట్లు, లగ్జరీగా ఉండే రెస్ట్ రూములు కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు చిత్రపటం కూడా ఉంది. కాగా, ఇదే స్టేషన్ లో త్వరలోనే ఓ మల్టీ ప్లెక్స్ కూడా రానుంది.