telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నగర వాసులకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం విశేష కృషి

నగర వాసులకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలకు అందించేందుకు తెలంగాణ  ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. నగరంలో ఇంతకు ముందు  పేరొందిన ప్రధాన ఆసుపత్రులలో నగర వాసులే కాకుండా, వివిధ వ్యాధులతో బాధపడుతున్న పేదలు చికిత్స నిమిత్తం  రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసుపత్రులకు వచ్చి చికిత్స చేసుకుంటారు. అదే విధంగా తెలంగాణకు ప్రక్కన ఉన్న రాష్ట్రాల నుండి కూడా హైదరాబాద్ కు వచ్చి చికిత్స పొందుతారు.
టీ మ్స్ ఆసుపత్రులు నిర్మాణాలు .
పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య చికిత్స ను  అందించాలనే ముఖ్య ఉద్దేశ్యం.
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు  హైదరాబాద్‌లో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. అల్వాల్, ఎల్‌బీ నగర్, సనత్‌నగర్‌లలో ఏర్పాటు కానున్న మూడు కొత్త ఆసుపత్రులకు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) అని పేరు పెట్టారు. రూ.2,679. కోట్ల వ్యయంతో ఈ మూడు  ఆసుపత్రుల ఏర్పాటుకు   రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీకారం  చుట్టారు. అట్టి పనులు కూడా ప్రారంభం అయ్యాయి.

గచ్చిబౌలి లోని GMC బాలయోగి అథ్లెటిక్ స్టేడియంకు ఆనుకుని ఉన్న 15-అంతస్తుల స్పోర్ట్స్ హాస్టల్ భవనాన్ని కోవిడ్-19 మొదటి వేవ్ సమయంలో ప్రభుత్వం TIMS ను ఏర్పాటు చేసింది. ఈ  స్పెషాలిటీ మరియు సూపర్-స్పెషాలిటీ సేవలను అందించడానికి ఒక్కొక్క ఆసుపత్రిలో 1,000 పడకలు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహాలో TIMS  లో  స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు,నర్సింగ్ మరియు పారా మెడికల్ కోర్సులలో వైద్య విద్యను అందించనున్నారు
నైట్ షెల్టర్


ముఖ్యమంత్రి కే సి అర్ ఆదేశాల మేరకు  నగరంలో పలు ప్రధాన ఆసుపత్రుల్లో రోగి బంధువుల వసతి కోసం రూ.10.68 కోట్ల వ్యయం తో సుమారు 900 మందికి కనీస  వసతుల కోసం 7 ఆసుపత్రుల్లో నైట్ షెల్టర్లు  భవనాలు అందుబాటు లో ఉన్నాయి.. బస్తీ దవాఖాన లు
నగరంలో నివసించే పేద ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య పరీక్షలకు  పైసా ఖర్చు లేకుండా ఉచిత సేవలకు గాను నగరం లో  వార్డుకు 2 చొప్పున బస్తి దవాఖానలను ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 286 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. మరో 8 బస్తీ దవాఖానలు వివిధ  ప్రగతి దశలో కలవు. ఇప్పటి వరకు ఈ బస్తీ దవాఖానల  ద్వారా ఫిబ్రవరి 2023 వరకు 1 కోటి70 లక్షల 44 వేల  671 మందికి వైద్య పరీక్షలు చేశారు.

కే సి ఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవాలు సందర్భంగా ఈ నెల 14వ తేదీన తెలంగాణ వైద్య ఆరోగ్య  దినోత్సవాన్ని పురస్కరించుకొని  గర్భిణీ స్త్రీల కోసం న్యూట్రిషన్ కిట్ లను అందించనుంది ప్రభుత్వం. గర్భిణీలలో బలహీనతను అరికట్టడానికి, పోషకాహారాన్ని మెరుగు పర్చడం కోసం కే సి అర్ న్యూట్రిషన్ కిట్స్ ను పంపిణీ చేయనున్నారు. జి హెచ్ ఎం సి పరిధిలోని  మొత్తం 75 సెంటర్ల ద్వారా  4400 మంది గర్భిణీ స్త్రీలకు ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న  అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రెండవ,మూడవ  చెక్ అప్ చేసుకున్న గర్భిణీ స్త్రీలకు ఉచితంగా కిట్ లను పంపిణీ చేస్తారు. పోషకాహారంను మెరుగుపరిచేందుకు హర్లిక్స్, ఐరన్ సిరప్, ఖర్జూర, నెయ్యి,  పల్లి చిక్కి, ఒక కప్పు, బాస్కెట్  కూడా పంపిణీ చేస్తారు.

జోన్ కు ఒక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  అధికారి కార్యాలయం మంజూరు
నగరంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింతగా చేరువ చేయడానికి జి హెచ్ ఎం సిలో ఉన్న ఆరు జోనల్ కార్యాలయ పరిధిలోకి  ఒక్కొక్క జోన్ కు ఒక జిల్లా వైద్య ఆరోగ్య  శాఖ (DM &HO) అధికారి కార్యాలయాల ఏర్పాటుకు ఇటీవల   క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

రోగి బంధువులకు రూ 5 లకే భోజనం నగరంలో గల ప్రభుత్వ  ఆసుపత్రుల్లో  రోగి బంధువులకు భోజన వసతి కల్పించేందుకు హరే రామ  హరే కృష్ణకు చెందిన అక్షయ పాత్ర ద్వారా రూ.5 లకే   భోజనం ను అందించేందుకు  నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో నగరం లోనీ 15 ప్రధాన ఆసుపత్రుల్లో మూడు పూటలు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి  డిన్నర్ ను రూ. 5 లకే అందజేయడం జరుగుతుంది ఇప్పటి వరకు 17 లక్షల 52 వేల మంది లబ్ది పొందారు..

Related posts