ఈ రోజు(14వ తేదీ) తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఒకటి, రెండు ప్రదేశములలో మరియు రేపు, ఎల్లుండి(15,16వ తేదీలు ) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి. రాగల 3 రోజులు (14,15,16వ.తేదీలు) ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు(గంటకి 30 నుండి 40 కిమి వేగం) కూడిన వర్షం (ముఖ్యంగా రేపు, ఎల్లుండి దక్షిణ, మధ్య, తెలంగాణ జిల్లాలలో) ఒకటి, రెండు ప్రదేశములలో తెలంగాణా రాష్ట్రంలో వచ్చే అవకాశములు ఉన్నాయి. తుఫాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి(15,16వ తేదీలలో) వుండే అవకాశం వుంది(ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా వుండే అవకాశం)
previous post
next post
సమ్మె మొదలైన వారంలోనే కార్మికులపై కుట్రలు: మందకృష్ణ