తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత కవరేజ్‌కి మీడియాకు అనుమతివ్వాలనిదాఖలైన పిటీషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.చేశారు. దీనిపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. కూల్చివేతలవద్దకు ఎవరినీ అనుమతించలేమని ప్రభుత్వం తెలిపింది. ఎందుకు అనుమతి ఇవ్వరో చెప్పాలని, కూల్చివేతపై గోప్యత ఎందుకని న్యాయస్థానం ప్రశ్నించింది.
కోవిడ్ బులిటెన్‌ల తరహాలో కూల్చివేతలపై సమాచారం ఇవ్వచ్చునని హైకోర్టు సూచించింది. అయితే ఇప్పటికే 95 శాతం కూల్చివేతలు పూర్తి అయ్యాయని ప్రభుత్వం తెలిపింది. కూల్చివేతల కవరేజ్ కోసం మీడియాకు అధికారిక ప్రకటనలు ఎందుకు చేయడంలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. శుక్రవారంలోగా ప్రభుత్వం నిర్ణయం తెలపకపోతే తామే ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఏపీలో మతమార్పిళ్లు తప్ప మరేం జరగడం లేదు: కన్నా