telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌..ఈ సారి బాలిక‌ల‌దే పై చేయి

*తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌..
*ఈ సారి బాలిక‌ల‌దే పై చేయి
*ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన 9 ల‌క్ష‌ల మంది విద్యార్ధులు..
*ప‌స్ట్ ఇయ‌ర్‌లో 63.32 శాతం ఉత్తీర్ణ‌త‌
*సెకండ్ ఇయ‌ర్‌లో 67.96 శాతం ఉత్తీర్ణ‌త‌

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదయ్యాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేసింది.

ఇంటర్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ప‌స్ట్ ఇయ‌ర్‌లో 63.32 శాతం ,సెకండ్ ఇయ‌ర్‌లో 67.96 శాతం ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు తెలిపారు. ఈ ఏడాది 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు. 

Related posts