telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

corona vairus

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2.85 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 1,32,364 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,85,74,350 కి చేరింది. ఇందులో 2,65,97,655 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,35,993 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2713 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,40,702 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 2,07,071 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌పోతే, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 22,41,09,448 మందికి వ్యాక్సిన్ అందించారు.

Related posts